మే 31 కల్లా ఆధార్ తో పాన్ లింక్ అవ్వాలి
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025
మే 31 కల్లా ఆధార్ తో పాన్ లింక్ అవ్వాలి
అలాగైతేనే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం చర్యలుండవ్
న్యూఢిల్లీ :

వచ్చే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానం పూర్తయితే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ తెలియజేసింది.
ఐటీ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్‌తో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) లింక్ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్ మినహాయింపులుంటాయి. కాగా, లావాదేవీ సమయంలో పాన్ ఇన్‌ఆపరేటివ్‌లో ఉన్న ట్యాక్స్‌పేయర్లకు టీడీఎస్/టీసీఎస్ షార్ట్ డిడక్షన్/కలెక్షన్ ఎగవేతకు పాల్పడ్డారన్న నోటీసులు వస్తున్నట్టు సీబీడీటీ తెలిపింది. ఈ మేరకు తమకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొన్నది. అయితే అలాంటి కేసుల్లో మే 31కల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానం కాకపోయినా సాధారణ రేటుకే టీడీఎస్/టీసీఎస్ వసూలుంటుందని సీబీడీటీ స్పష్టం చేసింది.
కాగా, 2022 జూన్ 30 వరకు ఆధార్‌తో పాన్ అనుసంధానం ఉచితంగానే జరిగింది. జూలై 1 నుంచి 2023 జూన్ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. అప్పటికీ లింక్ అవ్వని పాన్ జూలై 1 నుంచి ఇన్‌ఆపరేటివ్‌లోకి వెళ్లింది. దీన్ని ఆపరేషన్‌లోకి తేవాలంటే రూ.1,000 ఫైన్ కట్టాల్సిందే.
కానీ 30 రోజుల సమయం పడుతుంది. ఆధార్, పాన్ లింక్ కాకపోతే ఐటీ రిఫండ్ ఉండదు. లింక్ చేసుకుంటే రిఫండ్ వస్తుంది. కానీ, ఆలస్యానికి ఐటీ శాఖ నుంచి వడ్డీ రాదు.
