Category: ఎడిటోరియల్

భారత విదేశాంగ విధానంలో లెక్కకు మించిన తప్పిదాలు: ఒక విశ్లేషణ.

భారత విదేశాంగ విధానంలో లెక్కకు మించిన తప్పిదాలు: ఒక విశ్లేషణ.————-అంతర్జాతీయ రాజకీయాల్లో మౌనం అనేది కేవలం నిశ్శబ్దం కాదు. అది కూడా ఒక బలమైన సంకేతం. ఇటీవల అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్ పై చేసిన దాడికి భారత ప్రభుత్వం చూపిన స్పందనలేమిటన్న ప్రశ్న, దేశ విదేశాంగ విధానం...

ప్రజాస్వామ్యం ముసుగులో అమెరికా రక్త చరిత్ర కుట్రలు..

ప్రపంచ రాజకీయ చరిత్రను లోతుగా పరిశీలిస్తే ఒక గంభీరమైన విరుద్ధత మన ముందుకొస్తుంది. ఒకవైపు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అనే విలువలను ప్రపంచానికి బోధించే శక్తిగా నిలిచిన అమెరికా; మరోవైపు అదే దేశం అనేక దేశాల అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకొని ప్రభుత్వాలను పడగొట్టడం, నాయకులను...

విద్వేశపు గుండె చప్పుడు: ఫారూక్ అబ్దుల్లాపై దాడి

మార్చి 11, 2026 నాడు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లాపై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం మాత్రమే కాదు. అది నేటి భారత దేశ సామాజిక రాజకీయాలపై చెరగని ఓ నల్లటి మత విద్వేషపు కుట్రల మరక. 88 ఏళ్ల...

బౌద్ధ ధమ్మంలో మానవ స్వాతంత్ర్యానికి తాత్విక పునాది

బౌద్ధ ధమ్మం: భయంపై కాదు, బుద్ధిపై నిలిచిన జీవన తత్వం ప్రపంచ మత చరిత్రలో బౌద్ధ ధమ్మానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది మనిషిని భయపెట్టి విధేయుడిని చేయాలనుకోదు. దేవుడు, స్వర్గం, నరకం వంటి ఆశలు–భయాల ఆధారంగా జీవనాన్ని నియంత్రించకుండా, మనిషి తన జీవితానికి తానే బాధ్యత...

నీకు నువ్వే సాటి..!

నీకు నువ్వే సాటి..! నీలో ఒక శూన్యం భ్రమిస్తూచీకట్లో చైతన్యాన్ని అణచివేస్తూనీ నమ్మకాన్ని పోగొడుతూఅభద్రతాభావం సృష్టిస్తోంది.. ఇకనైనా నిద్రలేచికళ్ళముందు సత్యాన్ని గ్రహించిరగిలే నిప్పుకనమై కదులుతూకిరణమై నింగిలో ప్రకాశించు.. ఇకనైనా వదులు నీ అశాంతినిస్థిరత్వమైన పనులను చేస్తూఎగిసిపడే నీటి కెరటంలారేపటికి విజయగాథలు సృష్టించు.. ఈనాటి ఆలోచనలేభవిష్యత్తుకు భరోసాగాధైర్యాన్ని పెట్టుబడిగా...

ఫిబ్రవరి 21 – భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రజాస్వామ్య మైలురాయి

✍️ అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B(నవయాన బౌద్ధ సద్ధమ్మ ప్రచారకులు) భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1948 ఫిబ్రవరి 21 ఒక అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. ఆ రోజు కేవలం ఒక పరిపాలనా కార్యక్రమం కాదు; అది శతాబ్దాల సామాజిక అన్యాయాలకు ముగింపు పలికే నూతన...

యుజిసి సమానత్వ చట్టంపై సుప్రీం కోర్టు స్టే ఎత్తివేత కోసం ప్రజా ఉద్యమం తప్పనిసరి-ఆర్.పి.ఐ (బి.ఎ)

యుజిసి సమానత్వ నియమావళి 2026 మరియు సామాజిక న్యాయంపై ద్వంద్వ పోరాటం చేస్తే బహుజనులు తాము కూర్చున్న కొమ్మను తామే నరికినట్లు అవుతుంది. సామాజిక న్యాయం అనేవి రాజ్యాంగ ఆధారాలు అయినప్పటికీ, అవి అమలు స్థాయిలో ఎల్లప్పుడూ సుప్రీంకోర్టు తీర్పులతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్...

మహాప్రాణ్ జోగేంద్రనాధ్ మండల్ 122వ జయంతి: బహుజనుల గొప్ప నాయకుడు

బహుజన్ సాలిడారిటీ డే – జనవరి 29 : బహుజన సాలిడారిటీ డే అనగా – బహుజనులు (దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనారిటీలు, శ్రామిక వర్గాలు) కులం, మతం, ప్రాంతం తేడాలు పక్కన పెట్టి ఐక్యంగా నిలబడి తమ సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం సంఘటితంగా...

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

డా. అంబేడ్కర్ ఆశయాలతో, బౌద్ధ ధమ్మ మార్గంలో భారత గణతంత్రం దేశ ప్రజలందరికీ 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జనవరి 26 భారత ప్రజల జీవితాల్లో ఒక పండుగ మాత్రమే కాదు; అది మన రాజ్యాంగ స్పృహను, పౌర బాధ్యతను, సామాజిక చైతన్యాన్ని మేల్కొలిపే రోజు....

ప్రపంచ గణతంత్ర భావనకు భారతీయ మూలం

వైశాలి గణరాజ్యం – బౌద్ధ ధమ్మం మరియు అంబేడ్కర్ దృష్టి ✍️ అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B గణతంత్రం : పాశ్చాత్య ఆలోచనా? భారతీయ వారసత్వమా? ప్రపంచ రాజకీయ చరిత్రలో గణతంత్ర భావనను సాధారణంగా గ్రీస్, రోమ్ వంటి పాశ్చాత్య నాగరికతలకు పరిమితం చేస్తూ...