బిగ్ బ్రేకింగ్.. రాష్ట్రంలో కరోనా కేసులు మాస్క్ లేకపోతే ఫైన్…
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

బిగ్ బ్రేకింగ్.. రాష్ట్రంలో కరోనా కేసులు మాస్క్ లేకపోతే ఫైన్…
Date : 20 December 2023 తెలంగాణ / హైదరబాద్ : బిగ్ బ్రేకింగ్..
రాష్ట్రంలో కరోనా కేసులు మాస్క్ లేకపోతే ఫైన్… రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది.
రాష్ట్రంలో ప్రభుత్వం నిన్నటి నుంచి కరోనా బులెటిన్ విడుదల చేస్తోంది.తాజాగా నాలుగు కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న 402 టెస్టులు చేయగా.. వాటిలో నలుగురికి పాజిటివ్ వచ్చింది. కాగా.. గాంధీ ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డు ఏర్పాటుచేశారు.
మొత్తం 9 మంది కరోనా ఐసోలేషన్లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు తప్పకుండా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీచేసింది. మాస్క్ ధరించకపోతే ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.
