రాజధాని రణభేరి సభ, సుర్వేష్ ముదిరాజ్ నేతృత్వంలో భారీగా తరలిన రాజేంద్రనగర్ ప్రజానీకం
- ముదిరాజ్‌లకు న్యాయం ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత శేఖర్ ముదిరాజ్ ఫైర్. - October 24, 2026
- మణికొండలో మితిమీరిన బహిరంగ మద్యపానం..అమృత్ వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మణికొండ వాసుల డిమాండ్. - October 24, 2026
- రాజధాని రణభేరి సభ, సుర్వేష్ ముదిరాజ్ నేతృత్వంలో భారీగా తరలిన రాజేంద్రనగర్ ప్రజానీకం - October 24, 2026

రాజేంద్రనగర్ : రాజధాని రణభేరి సభ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకుల మద్దతుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా. తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు నీరుడు సర్వేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో, మహిళా నాయకురాలు బోనగిరి ఇంద్ర నేతృత్వంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుండి నాయకులు, మహిళలు ఈ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి సుమారు 224 మంది ముఖ్య నాయకులు, మహిళా కార్యకర్తలు భారీ కాన్వాయ్‌తో తరలివెళ్లి సభను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా "జై తెలంగాణ.. జై కవితమ్మ" అంటూ నినాదాలు చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయడంపై నీరుడు సర్వేష్ ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కుల సాధనలో మహిళలు, నాయకులు ఎల్లప్పుడూ ముందుంటారని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.
