రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ నాయకుడికి సర్పంచ్ పరామర్శ

1001293331.jpg

వెల్దండ:రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెల్దండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బాదేపల్లి రామకృష్ణను స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ శుక్రవారం పరామర్శించారు. రామకృష్ణ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే యెన్నమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రామకృష్ణకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. రామకృష్ణ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర శ్రీను, స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...