శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది.
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. - October 23, 2026
- సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ‘సరాకా’ పరిశ్రమలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన. - October 23, 2026
- కల్వకుంట్ల కవిత, సర్వేష్ ముదిరాజ్ సమక్షంలో శబరిమల పోస్టర్ ఆవిష్కరణ - October 19, 2026

శంషాబాద్ : హైదరాబాద్ నుంచి 109 మంది ప్రయాణికులతో ముంబయి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI417 అత్యవసరంగా ల్యాండ్ అయింది.
టేకాఫ్ అయిన కేవలం 5 నిమిషాలకే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సిబ్బందికి సమాచారం అందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టులో క్షేమంగా ల్యాండింగ్ చేశారు.
పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ల్యాండింగ్ అనంతరం సాంకేతిక బృందం విమానాన్ని ఆధీనంలోకి తీసుకుని లోపానికి గల కారణాలపై తనిఖీలు చేపట్టింది.
