ఘనంగా కనకదుర్గాదేవి శోభాయాత్ర
- ప్రతి మహిళ దుర్గాదేవిలా హిందూ సంస్కృతిని, దేశాన్ని రక్షించాలి - October 22, 2026
- పొద్దుటూరు గ్రామంలో ఘనంగా పండగల సాయన్న జయంతి వేడుకలు
- October 22, 2026 - అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏడుపాయలలో భవాని మాత నిమజ్జనం - October 22, 2026

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 21: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కనకదుర్గాదేవి నిమజ్జన వేడుకలను బుధవారం భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారికి భక్తులు వీడ్కోలు పలుకుతూ శోభాయాత్రను వైభవంగా చేపట్టారు. మండలంలోని కట్టంగూర్, ఈదులూరు, పరడ, ముత్యాలమ్మగూడెం, అయిటిపాముల గ్రామాల్లో అమ్మవారి శోభాయాత్రలు భక్తుల సందడి మధ్య కొనసాగాయి. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి విగ్రహాలను అలంకరించిన వాహనాలపై ఉంచి శోభాయాత్ర చేపట్టారు. డప్పుచప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాలు, అమ్మవారి నామస్మరణల మధ్య గ్రామ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర సాగింది. మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు. సర్పంచ్ గుల్లి నరేష్, ముడుసు భిక్షపతి, రామలింగయ్య, రామకృష్ణ, శంకర్, శ్రీశైలం, యాదగిరి, రాంబాబు, శంకర్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
