విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
- అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏడుపాయలలో భవాని మాత నిమజ్జనం - October 22, 2026
- మహాలింగాపురంలో వైభవంగా దుర్గామాత నిమజ్జనం - October 22, 2026
- చేవెళ్ల ఎమ్మెల్యే కు దసరా శుభాకాంక్షలు తెలిపిన శంకర్పల్లి కాంగ్రెస్ నాయకులు - October 22, 2026

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 21 : విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సెంచల్ గూడెం జైలర్ సంజీవరెడ్డి సూచించారు. కట్టంగూర్ కు చెందిన వీరమళ్ల హనుమాన్–మంజుల దంపతుల ప్రథమ పుత్రిక తేజశ్రీ ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలితాల్లో మెడిసిన్ సీటు సాధించి వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కించుకుంది. చిన్ననాటి స్నేహితుడి కుమార్తె వైద్య విద్యలో సీటు సాధించడంతో ఆనందం వ్యక్తం చేసిన జైలర్ సంజీవరెడ్డితో పాటు ఆయన చిన్ననాటి మిత్రులు బుధవారం తేజశ్రీ నుంచి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని, తేజశ్రీ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు తల్లిదండ్రుల కలలను సాకారం చేయగలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిమ్మనగోటి రమేష్, భూపతి సురేష్, చెరుకు శ్రీనివాస్ పోగుల యాదగిరి, కానుగు శీను, కొంపెల్లి నాగరాజు, బండ శ్రవణ్, అంతటి నగేష్, మాతంగి శంకర్ తదితరులు పాల్గొన్నారు
