జనగామ బీరప్పగడ్డలో అంగరంగ వైభవంగా దుర్గమ్మ నిమజ్జనం
- జనగామ బీరప్పగడ్డలో అంగరంగ వైభవంగా దుర్గమ్మ నిమజ్జనం - October 22, 2026
- చిన్న రాంచర్లలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి - October 22, 2026
- పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు - October 22, 2026
జనగామ జిల్లా కేంద్రంలోని బీరప్పగడ్డలో మహారాణి దుర్గా మాయ ఆధ్వర్యంలో దుర్గమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 50 మందితో నిర్వహించిన శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాసిక్ డోలు దరువులతో బీరప్పగడ్డ పరిసరాలు మార్మోగగా, భక్తులు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు.నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,మంగళహారతులు సమర్పించారు. అనంతరం నాసిక్ డోలు వాయిద్యాల నడుమ శోభాయాత్రను వైభవంగా చేపట్టారు. డోలు దరువులకు అనుగుణంగా భక్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో బీరప్పగడ్డలో పండుగ వాతావరణం నెలకొంది.భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుక స్థానికులను ఆకట్టుకుంది. దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో జనగామ ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మహారాణి దుర్గా మాయ కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.
