కార్మికులతో కలిసి భోజనం చేసి.. దసరా పండుగకు వారి కుటుంబాల్లో ఆనందం నింపిన చైర్‌పర్సన్!
- కార్మికులతో కలిసి భోజనం చేసి.. దసరా పండుగకు వారి కుటుంబాల్లో ఆనందం నింపిన చైర్‌పర్సన్! - October 21, 2026
- పోలీస్ అమరవీరులకు జోహార్ ప్రజల రక్షణే ధ్యేయంగా ప్రాణత్యాగమే పరమార్థంగా - October 21, 2026
- సద్దుల బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే పల్లా దంపతుల సందడి. - October 19, 2026

కార్మికుల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ, వారితో ఆత్మీయంగా మెలిగే నాయకులే ప్రజల మనసుల్లో నిలిచిపోతారని మాల మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి తాటి కుమార్ అన్నారు.జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ దసరా పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు విందు ఏర్పాటు చేయడంతో పాటు, వారితో కలిసి భోజనం చేయడం అభినందనీయమన్నారు. గత ఏడు, ఎనిమిది నెలలుగా కార్మికుల సమస్యలపై ఆమె సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. నూతన వాహనాలు, సిబ్బంది వచ్చిన సందర్భంగా కార్మికుల కోరిక మేరకు విందు ఏర్పాటు చేసి, వారితో కలిసి వాహనాల్లో పట్టణమంతా పర్యటించడం సంతోషకరమన్నారు.గతంలో పండుగ వేళ జీతాల చెల్లింపులో ఇబ్బందులు ఎదురయ్యేవని, ఈసారి ముందుగానే జీతాలు చెల్లించడం కార్మికుల్లో ఆనందం నింపిందన్నారు. ఈ కార్యక్రమంతో సుమారు 400 నుంచి 500 కుటుంబాలకు పండుగ సంతోషం అందిందని పేర్కొన్నారు.
