అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్ 18 : దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆకాంక్షించారు. మండలంలోని పరడ గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుర్గామాత కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సంతోషంగా జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. అమ్మవారి ఆరాధన ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు మనసుకు ప్రశాంతతను కలిగిస్తుందని పేర్కొన్నారు. దైవభక్తితో పాటు సేవాభావాన్ని అలవర్చుకోవాలని, అన్నదానం వంటి కార్యక్రమాలు మానవత్వానికి ప్రతీకలని అన్నారు. గ్రామ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించాలని, పాడిపంటలతో గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ ఎంపీటీసీ మంగదుడ్ల వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు పెద్ది బాలనర్బయ్యగౌడ్, జీడిపల్లి ఉపేందర్ రెడ్డి, పుట్ట శిశుపాల్ రెడ్డి, పాట్ల సురేందర్రెడ్డి, కాసర్ల గౌతంరెడ్డి, శ్రీపాద యాదగిరి. అంతటి శ్రీను. పోతరాజు నగేష్ తదితరులు పాల్గొన్నారు.1000382412.jpg

You may also like...