అంబరాన్నింటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బతుకమ్మ సంబరాలు
- అంబరాన్నింటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బతుకమ్మ సంబరాలు - October 18, 2026
- అనారోగ్యంతో ఉన్న హుస్సేన్కు సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు పరామర్శ - October 18, 2026
- క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం..సుంకిరెడ్డి - October 18, 2026
కల్వకుర్తి అక్టోబర్ 17: కల్వకుర్తి పట్టణంలోని బలరాం నగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రథమ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటలు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోటీలు నిర్వహించి, తల్లులతో కలిసి బతుకమ్మ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ బొల్లె పర్వతాలు, మండల కో-ఆర్డినేటర్ సృజన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, మహిళలు పాల్గొన్నారు.
