తుల్జా భవానీ ఆలయ అభివృద్ధికి సుంకిరెడ్డి రూ.1.20 లక్షల విరాళం
- కౌన్సిలర్‌కు అండగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి - October 19, 2026
- దుర్గామాతకు ప్రత్యేక పూజలు.. బీజేపీ నూతన బాధ్యులకు సన్మానం - October 19, 2026
- కల్వకుర్తి వాసవి దేవాలయానికి ఉప్పల వెంకటేష్ రాక - October 19, 2026

కడ్తాల్ అక్టోబర్ 16 :కడ్తాల్ మండలం వెలుగురాళ్ల తండాలో శ్రీ తుల్జా భవానీ మాత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ పెయింటింగ్ పనుల కోసం రూ.1.20 లక్షల విరాళాన్ని అందించారు. ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.విరాళం అందించిన రాఘవేందర్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు, తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం కర్కల్‌పహాడ్ గ్రామంలో సర్పంచ్ తేజురాం ఆధ్వర్యంలో నిర్వహించిన దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు చిట్టి రమేష్, తేజురాం, ఉపసర్పంచ్ పంత్య నాయక్, మాజీ సర్పంచ్ ఇస్లావత్ పాండు, వార్డు సభ్యులు, నాయకులు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు ఎగిరిశెట్టి లింగం, రమేష్, మల్లేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
