కేటీఆర్ చేతుల మీదుగా నూతన పాట ఆవిష్కరణ.!
- యూత్ డిక్లరేషన్ ర్యాలీని జయప్రదం చేయండి.. గోలి - September 4, 2026
- ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు టాస్క్ సిఓఓ రూ. లక్ష విరాళం - September 4, 2026
- ప్రజా ప్రభుత్వం కాదు ” దగా ప్రభుత్వం” - September 4, 2026

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగాగోలి శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా సింగం విజయ్ గౌడ్ రచనలో రూపొందిన నూతన పాటను కేటీఆర్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,జిల్లా నాయకులు నాగులు నాయక్, మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి,తలకొండపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురమల్ల సుభాష్,సర్పంచ్ జల్లెల్ల కృష్ణ,సత్యం తదితరులు పాల్గొన్నారు.
