ఎంగిలి విస్తరాకు దగ్గర కుక్కల్లా కొట్టుకుంటున్నారు:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- కేఎస్ రత్నంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం నేత బండమీది వెంకటేష్ - September 2, 2026
- కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన - September 2, 2026
- కంటోన్మెంట్లోనే తుపాకులు ఎత్తుకెళ్లారు. - September 2, 2026

ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్ర సంపద కోసం ఎంగిలి విస్తరాకు దగ్గర కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టి అధికారంలో ఉన్నవారు స్వప్రయోజనాల కోసం పరస్పరం పోటీ పడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐ మ్యాక్స్ స్థాయికి చేరాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సంపదను ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన పాలకులు దాని కోసం ఎంగిలి విస్తరాకు దగ్గర కుక్కల్లా కొట్టుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటలతో కాలం వెళ్లదీస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ అరాచక పాలనకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
