కర్ణాటకలో కీలక మార్పు.. సిద్ధరామయ్య రాజీనామా

కర్ణాటక రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో జరిగిన కీలక అల్పాహార సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేశారు.

పదవి వదులుకోవడంపై తనకు ఎలాంటి బాధ లేదని సిద్ధరామయ్య తెలిపారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కేబినెట్‌ను రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు చెప్పారు.

ఈ పరిణామంతో డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్‌లో అధికార మార్పిడికి మార్గం సుగమమైనట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

You may also like...

Translate »