ఎడ్ల గురువారెడ్డి సేవలు చిరస్మరణీయం..!
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

ఎడ్ల గురువారెడ్డి సేవలు చిరస్మరణీయం..!
- చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు.
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి జూన్ 13.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమర యోధుడు సిద్దిపేట మొట్ట మొదటి శాసనసభ్యులు ఎడ్ల గురువారెడ్డి సేవలు అభివృద్ధి మరవలేనివని చిరస్మరణీయంగా గుర్తిండి పోతాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సులు అన్నారు.
ఎడ్ల గురువారెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా గురువారం రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, సిద్దిపేట ప్రాంతం అభివృద్ధి చెందిందంటే మొదట బీజం వేసింది ఎడ్ల గురువారెడ్డి అని ఆయన మొట్ట మొదటి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరవాత సిద్దిపేటకు కరెంటు తీసుకువచ్చారని, అదే విధంగా పేద విద్యార్థులకు మారుమూల గ్రామాల వారికి ఉన్నత విద్య అందాలని సిద్దిపేటకు డిగ్రీ కళాశాలను మంజూరు చేపించి స్థాపించారని ఆయన గుర్తు చేశారు.
ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పని చేసినప్పటికీ సాదాసీదా జీవితాన్ని గడిపారని తనకు వచ్చిన వేతనాన్ని డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఇచ్చే వారని తన పదవి దిగిన తర్వాత వచ్చిన పెన్షన్ ను భారత కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చే వారని, ప్రజల కోసం సిద్దిపేట ప్రాంతం కోసం నిరంతరం ఆలోచించిన గొప్ప నాయకులు ఎడ్ల గురువారెడ్డి అని కొనియాడారు. ఆయనను స్పూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, ప్రెస్ అకాడమీ జిల్లా అధ్యక్షులు రంగాచారి, మాజీ జెఏసి చైర్మన్ పాపయ్య, సిపిఐ సీనియర్ నాయకులు ఎడ్ల వెంకటరామిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కిష్టపురం లక్ష్మణ్, కనుకుంట్ల శంకర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈరి భూమయ్య, పిట్ల మల్లేశం, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ నాయకులు బేక్కంటి సంపత్, బిక్షపతి, ప్రసన్నకుమార్, సుధాకర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
