కల్వకుర్తి సీతారామాంజనేయ ఆలయంలో లడ్డూ వేలం – రూ.3.16 లక్షలు పలికిన గణేష్ లడ్డూ

కల్వకుర్తి పట్టణంలోని శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయంలో బుధవారం వినాయక లడ్డూ వేలం పాట నిర్వహించారు.నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి నైవేద్యంగా పెట్టిన లడ్డూను వేలం వేయగా, స్థానికుడైన బ్రృంగి శ్యాంమోహన్ రూ.3.16 లక్షలకు దక్కించుకున్నారు.అనంతరం వినాయక విగ్రహ దాతలు దుర్గాప్రసాద్, శివకుమార్ లను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పసుల లలిత, రాచోటి శ్రీశైలం, వెంకట్ రెడ్డి, బాలసాయి, రమాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుట్టినరోజు వేడుకల్లో నిరుపేదలకు అల్పాహారం పంపిణీ

జనగామ: బుస్సారి శ్రీకృతి పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు బుస్సారి శోభ, మోహన్ ఆధ్వర్యంలో జనగామ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలు, గుడిసెవాసులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించిన జనగామ అమ్మ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కొయ్యడ రవి, తుంగ సతీష్, సిద్ధిరాల చందు, బింగి నరసింహులను ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్, ప్రధాన కార్యదర్శి వంగ భీమ్…

పేదలకు CMRF ఒక వరం లాంటిది: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట, నాగర్ కర్నూల్ జిల్లా:పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక వరం లాంటిదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందిస్తూ, వారికి అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు.నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే బుధవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అనారోగ్యంతో బాధపడుతున్న పేద…

సత్యశోధక్ సమాజ్ దినోత్సవ శుభాకాంక్షలు

సత్యశోధక్ సమాజ్ దినోత్సవ శుభాకాంక్షలు

రాష్టపిత జోతిబా ఫూలే 1873 సెప్టెంబర్ 24 న సత్యశోధక్ సమాజ్ ను స్థాపించారు. ఇది ఎంత శక్తివంతమైనది అంటే. ఈ సామాజిక వ్యవస్థపై పూర్తి ఆధిపత్యం కలిగి ఉన్న బ్రాహ్మణ భావజాలం ఉలిక్కిపడి లేచి ఆర్యసమాజ్ స్థాపించ వలసి వచ్చినంత.అప్పటికి శూద్రులు గా "ఇప్పుడు OBC,SC,ST లు గా సుమారు 6,743 కులాలుగా ఉన్నారు. సత్యశోధక్ సమాజ్ లక్ష్యం ఈ వ్యవస్థ లో బ్రాహ్మణ భావజాలం తెచ్చిన కుల విభజన, మరియు బ్రాహ్మణ భావజాలం మనపై…

విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఏపీకి సర్పంచ్ వినతిపత్రం అందజేత

వెల్దండ: అజిలాపూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ సిద్ధగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం వెల్దండ విద్యుత్ శాఖ ఏఈని కలిసి వినతిపత్రం అందజేశారు.గ్రామానికి రెండు 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు, 20 విద్యుత్ స్తంభాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే గ్రామంలో నిరంతరం విద్యుత్ దీపాలు వెలిగే సమస్యను నివారించేందుకు థర్డ్ వైరు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మాడుగుల మండలం ఇరువై గ్రామపంచాయతీ, వెల్దండ మండలం బైరాపూర్ నుంచి…

అంబటి వాగులో ప్రభుత్వ భూమిని పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి

అంబటి వాగులో ప్రభుత్వ భూమిని పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి త్వరితగతిన సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశంకట్టంగూర్: మండల కేంద్రంలోని అంబటి వాగు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని గురువారం ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. 359 సర్వే నంబర్‌లో 5.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా దేశ రామాచారి తనకు 30 సంవత్సరాల క్రితం 30 గుంటల భూమికి…

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి – సర్పంచ్ రమేష్ గౌడ్

వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సర్పంచ్ రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.గురువారం విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర గౌడ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో తీవ్రంగా ఉన్న లో వోల్టేజ్ సమస్య, తరచూ విద్యుత్ అంతరాయం వల్ల ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని తెలిపారు.గ్రామానికి అదనంగా రెండు 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్లు, 20 విద్యుత్ స్తంభాలు మంజూరు చేయాలని కోరారు. గృహ అవసరాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సౌకర్యం…

కల్వకుర్తిలో ఘనంగా రామాంజనేయ యూత్ గణపతి లడ్డూ వేలం

కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణంలోని రామాంజనేయ యూత్ గణపతి మండపం వద్ద నిర్వహించిన లడ్డూ వేలంపాట కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ వేలంపాటలో గణనాథుని లడ్డూను విశ్వనాథపల్లికి చెందిన అజయ్ రూ. 1,03,116 లకు దక్కించుకున్నారు.అనంతరం యువ నాయకుడు కడారి సంతు యాదవ్ చేతుల మీదుగా అజయ్ కు లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, భక్తులు, రామాంజనేయ యూత్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

భారీ వర్షానికి కూలిపోయిన ఇంటి గోడలు

దేవరుప్పుల మండలంలో కురిసిన భారీ వర్షాలకు ఓ పేద కుటుంబానికి చెందిన ఇల్లు కూలిపోయింది. దేవరుప్పుల మండలానికి చెందిన చింతమల్లయ్య ఇంటి గోడలు వర్షపు నీటికి తడిసి బలహీనమై ఒక్కసారిగా కూలిపోయాయి. దీంతో ఇంట్లోని సామగ్రి దెబ్బతిన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇల్లు కోల్పోయిన చింతమల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని, తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.

నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డికి ఘన సన్మానం

అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గం నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అడాపల గోపాల్ రెడ్డిని పలువురు నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.రైతులకు అండదండగా ఉంటూ వారి సంక్షేమం కోసం బాధ్యతాయుతంగా పనిచేసి, మార్కెట్ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అడపాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల మేలు కోసం తన వంతు కృషి చేస్తానని…