శంకర్‌పల్లి ఎంపీడీవోగా వి.ప్రవీణ్ కుమార్ బాధ్యతల స్వీకారం

శంకర్‌పల్లి ఎంపీడీవోగా వి. ప్రవీణ్ కుమార్ బాధ్యతల స్వీకారం

  • జిల్లేడు చౌదరిగూడెం నుంచి బదిలీపై రాక
  • అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో
  • అభివృద్ధే లక్ష్యమని తెలిపిన ఎంపీడీవో
  • ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబాటు
  • సమన్వయంతో ముందుకు సాగుతామని వెల్లడి

జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి:
శంకర్‌పల్లి మండల నూతన ఎంపీడీవోగా వి. ప్రవీణ్ కుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లేడు చౌదరిగూడెం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయన, బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా గౌరవ పత్రికా, ప్రింట్ మీడియా ప్రతినిధులకు నమస్కారం తెలియజేసిన ఆయన, శంకర్‌పల్లి మండల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడం, మండల పరిధిలో పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజలకు పారదర్శక పరిపాలన అందించడమే తన బాధ్యతగా భావిస్తున్నానని, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారంతో సమిష్టిగా పనిచేస్తానని స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.
శంకర్‌పల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని వి. ప్రవీణ్ కుమార్ తెలిపారు.

You may also like...