విద్యార్థి దశనుంచే ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన ఏర్పరుచుకోవాలి.
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

విద్యార్థి దశనుంచే ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన ఏర్పరుచుకోవాలి.
- రాజేంద్రనగర్ ట్రాఫిక్ డివిజన్ ఎసిపి ఎ.బాలాజీ
- చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశంజ్ఞాన తెలంగాణ,
చేవెళ్ల రంగారెడ్డి జిల్లా, జనవరి, 24:
విద్యార్థి దశనుంచే ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన ఏర్పరుచుకోవాలని రాజేంద్రనగర్ ట్రాఫిక్ డివిజన్ ఎసిపి ఎ.బాలాజీ అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని స్థానిక వివేకానంద జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనల పై చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం అధ్యక్షతన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ ట్రాఫిక్ డివిజన్ ఎసిపి ఎ.బాలాజీ మాట్లాడుతూ.మైనర్ బాలికలు, బాలురు వాహనాలను నడుపవద్దని తెలిపారు. వారి తల్లిదండ్రులు వారికి వాహనాలు ఇస్తే వారిపై చట్టప్రకారమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపవద్దని, ద్విచక్ర వాహనాలను హెల్మెట్ లేకుండా, కారును సీట్ బెల్టు లేకుండా నడవపడ్డని సూచించారు. అతి వేగంతో వాహనం నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమన్నారు. ట్రాఫిక్ నిబంధనల కు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం,కళాశాల డైరెక్టర్ ఇంద్రాసేనా రెడ్డి, పోలీసు సిబ్బంది , కళాశాల అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.

