మూడు లక్షల రూపాయల ప్రపోజల్ LOC అందజేసిన భీమ్ భరత్
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

నవాబు పేట మండలం మాదిరెడ్డి పల్లీ గ్రామానికి చెందిన దగ్గుల నారాయణ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర శస్త్రచికిత్స అవసరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో, చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామెన భీమ్ భరత్ గారిని సంప్రదించారు. పరిస్థితిని సానుభూతితో పరిశీలించిన భీమ్ భరత్ గారు వెంటనే స్పందించి, రాష్ట్ర శాసనసభాపతి గౌరవ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మూడు లక్షల రూపాయల ప్రపోజల్ లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) మంజూరు చేయించారు.
ఈ ప్రపోజల్ LOC ను గురువారం భీమ్ భరత్ గారి నివాసంలో జరిగిన కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులకు అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా భీమ్ భరత్ గారు మాట్లాడుతూ, అవసర సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ వైద్య సేవలకు దూరం కావద్దని, ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయుక్తమని తెలిపారు.
రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారి సహకారంతో ఈ సహాయం అందడం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. భీమ్ భరత్ గారు దగ్గుల నారాయణ గౌడ్ గారికి ఉత్తమ వైద్యం అందాలని, త్వరగా కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి రావాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాధిత కుటుంబానికి మానసిక ధైర్యం నింపారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో తక్షణ స్పందనతో ముందుండే నాయకత్వానికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది. అవసర సమయంలో ప్రజలకు అండగా నిలవడం ద్వారా ప్రజా సేవకు కట్టుబడి ఉన్నామని భీమ్ భరత్ గారు స్పష్టం చేశారు.


