నవచైతన్య యువజన సంఘం, కిశోర బాలికల సంఘం అధ్వర్యంలోసావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

నవచైతన్య యువజన సంఘం, కిశోర బాలికల సంఘం అధ్వర్యంలోసావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు
పర్వేద గ్రామంలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్ మాట్లాడుతు సావిత్రిబాయి ఫూలే (1831 జనవరి 3– 1897 మార్చి 10) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.[1] కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.[ఆధారం చూపాలి] పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని చెప్పారు.ఈ కార్యక్రమంలో నవచైతన్య యువజన సంఘం అధ్యక్షురాలు పి.శ్రీవాణి, ఉపాధ్యక్షురాలు సి హెచ్ .భవ్య, శిరీష, సుష్మిత, స్పందన, పావని తొంట నర్సిములు,కాడిగాని కుమార్, నవీన్, బైండ్ల ప్రకాష్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్,పి.సాయిలు పురుగుర్తి వెంకటమ్మ తదితరులు ఉన్నారు.
