తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధం: అదానీ గ్రూప్
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధం: అదానీ గ్రూప్
ఈరోజు డా. బి. ఆర్. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డితో పోర్ట్స్ – సెజ్ సిఇఓ శ్రీ గౌతమ్ అదాని పెద్ద కుమారుడు శ్రీ కరణ్ అదానీ, అదాని ఎరో స్పేస్ సిఇఓ శ్రీ ఆశీష్ రాజ్ వన్షి లతో చర్చలు జరిపారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వనిస్తున్నామని అన్నారు. ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదానీ గ్రూప్ ప్రతినిధులు అన్నారు. ప్రభుత్వం మారినప్పటికీ తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందు నిలబడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది.

వీటికి సంబంధించిన పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై సమావేశంలో చర్చించారు.సమావేశంలో మంత్రి శ్రీ దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన శ్రీమతి కార్యదర్శి శాంతికుమారి, ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్, సిఎం సెక్రటరీ శ్రీ షానవాజ్ ఖాసిమ్, సిఎం స్పెషల్ సెక్రటరీ శ్రీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
