నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల డేగ కన్ను.
- జీవితాన్ని వెలుగులోకి నడిపేది శుభ ఆలోచనే - July 16, 2026
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026

నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల డేగ కన్ను.
హైదరాబాద్ డిసెంబర్ 29:నూతన సంవత్సర వేడుకల్లో పోలీసులు పబ్బులు, బార్లు రెస్టారెంట్లపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తున్నారు.డ్రగ్స్ గంజాయి వాడకాన్ని పూర్తిగా నియంత్రించ డంతో పాటు పబ్బులు, బార్లలోకి మైనర్లు రాకుండా అడ్డుకు నేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది.ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిఘా బృందాలు మోహరించాయి మొత్తం 50కిపైగా బృందాల ను మఫ్టీల్లో విధుల్లోకి దింపి నట్లు ఎక్సైజ్ ఉన్నతా ధికారులు బుధవారం వెల్లడించారు.వీరంతా జిల్లా కేంద్రాల్లోని బార్లు రెస్టారెంట్లతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోని పబ్బుల్లో విధులు నిర్వర్తిస్తారని తెలిపారు నూతన సంవత్సర వేడుకల్లో ఎక్కడైనా డ్రగ్స్ వాడినా అశ్లీల నృత్యాలు చేసినా బార్లు పబ్బుల్లోకి మైనర్లను అనుమతించినా కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరికలు జారీ చేశారు.ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో నే 20 బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు అక్రమ మద్యం నియంత్రణ కోసం రైళ్లలో తనిఖీలు చేపట్టేందుకు 13 బృందాలను మోహరించినట్లు వెల్లడించారు.ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు విమానాశ్రయాల్లోనూ పటిష్ఠ నిఘా పెట్టామని వివరించారు.తనిఖీలకు కేటాయించిన బృందాలతోపాటు రెగ్యుల ర్‌గా విధులు నిర్వర్తించే ఎక్సైజ్ అధికారులు 3 షిఫ్టుల్లో 24 గంటలూ విధుల్లో ఉండేలా ప్రణాళి కలు రూపొందించినట్టు వివరించారు.
