రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళ్ సై.
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళ్ సై.
హైదరాబాద్ జనవరి 13: రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఈరోజు శనివారం నిర్వహించారు.ఈ వేడుకల్లో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పాల్గొని పాయసం వండారు. దేశ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు.
తనకు ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పొంగల్ అని పేర్కొన్నారు. ఎందుకంటే చిరకాల స్వప్నం రామ మందిర నిర్మాణం పూర్తి అయినట్లు చెప్పారు.శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా సౌభాగ్యంతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆమె ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.ఇది వికసిత భారత్ అని ఆమె పేర్కొన్నారు. గవర్నర్ తమిళసై శుక్రవారం పుదుచ్చరి రాజ్‌నివాస్‌లో పొంగల్ వేడుకల్ని నిర్వహించారు.
