ఉగాది పండుగ రోజు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన పృథ్వీరాజ్
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

జ్ఞాన తెలంగాణ పటాన్చెరు ఏప్రిల్ 9 – ప్రేమ్ కుమార్ (పటాన్ చెరువు రిపోర్టర్)
● ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు.
● తండ్రి దేవేందర్ రాజు సమక్షంలో అందించిన పటాన్చెరు యువనాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్.
పటాన్ చెరు పట్టణం లో ముస్లిం సోదరులకు ఎండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ రంజాన్ తోఫా అందించారు. దేవేందర్ రాజు గారి సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ… అల్లాను స్మరిస్తూ నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్దలతో కఠిన ఉపవాసాలు చేసిన తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా రంజాన్ పండగ చేసుకోవాలన్నారు. గత కొన్నేళ్ల నుంచి తాతగారు జైపాల్ ముదిరాజ్ గారు పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేస్తూ, ఎం డి.ఆర్ ఫౌండేషన్ నుంచి ముస్లిం సోదరులకు తోఫా పంపిణీ చేస్తున్నాము అని అన్నారు. పటాన్ చెరు పట్టణంలోని ఎం డి ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.


