బారాస సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగుల పై వేటు
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

బారాస సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగుల పై వేటు.
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది.
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ భారాస సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో ఉపాధి హామీ, సెర్ప్ ఉద్యోగులతో మెదక్ లోక్‌సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్ రవీందర్ రెడ్డి, మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు. ఇది బహిర్గతం కావడంతో వెంకట్రామిరెడ్డి, రవీందర్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను సీసీ టీవీ ఆధారంగా గుర్తించారు. సస్పెండైన వారిలో 38 మంది సెర్ప్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు.
