అలుపెరుగని అక్షర యోధుడు రామోజీరావు..
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

అలుపెరుగని అక్షర యోధుడు రామోజీరావు..
ఈనాడు చైర్మన్ రామోజీకి నివాళులు..
అక్షర యాత్రికులకు ఆదర్శమని ప్రశంస.
టీ డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పరకాల సమ్మయ్య గౌడ్ వేముల మహేందర్ గౌడ్…
జ్ఞానతెలంగాణ,చిట్యాల, జూన్ 08:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో టీ డబ్ల్యూ ఎఫ్ జె ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సమ్మయ్య గౌడ్ వేముల మహేందర్ గౌడ్, శనివారం విలేకరులతో మాట్లాడుతూ దివంగతులైన రామోజీరావుకు ఘన నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రామోజీరావు 70వ దశకంలో ఒక ఆదర్శంతోఒక పత్రికను స్థాపించిన వ్యక్తని ఎన్ని విమర్శలు వచ్చినా ఎదుర్కొంటూ తన లక్ష్యాన్ని వీడకుండా పత్రికను ఆదర్శవంతంగా ముందుకు నడిపారని కొనియాడారు కొందరు రాజకీయ నాయకులకు నచ్చిన నచ్చకపోయినా ఆయన తన పందా వీడకుండా ముందుకు సాగారని ఈనాడుతో పాటు ఈటీవీ గ్రూపుల సంస్థ చైర్మన్ గా మార్గదర్శి ప్రియా పచ్చళ్ళు వంటివి వెలుగులోకి తెచ్చిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించారు సాధారణ వ్యక్తిగా జీవితాన్ని మొదలుపెట్టి అక్షర యోధుడిగా అలుపెరుగని యాత్ర చేసి చరిత్ర సృష్టించిన యోధుడు ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు అని కొని ఆడారు అలాంటి పత్రిక దిగ్గజం ఈ రోజున కన్నుమూయడం అత్యంత విషాదకరమని వారు పేర్కొన్నారు ఆ భగవంతుడు రామోజీ కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఎక్కడ ఉన్న ఆయన ఆత్మ శాంతించాలని కోరుకున్నట్టు వివరించారు ఈ కార్యక్రమంలో టీ డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాటూరి రవీందర్ గౌడ్ అధ్యక్షులు దుర్గం సురేష్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మంగళపల్లి శ్రీనివాస్ మొగుళ్లపల్లి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నిమ్మల భద్రయ్య మురహరి మనోజ్ యూనియన్ నాయకులు వేముల కిరణ్ గౌడ్ తంగళ్ళపల్లి హరీష్ రాము చెక్క శ్రీధర్ బుర్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు.
