స్కూల్ యూనిఫార్మ్స్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎంపీపీ కందకట్ల కళావతి
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

స్కూల్ యూనిఫార్మ్స్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎంపీపీ కందకట్ల కళావతి
సంగెం జ్ఞాన తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠ్యపుస్తకాల పంపిణీ మరియు ఏక రూప దుస్తువులు పాఠశాల ప్రారంభం రోజే అందించాలి అనే దృఢసంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వంచేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మోడల్ స్కూల్ ,జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో హెచ్ఎం విక్రమ్ కుమార్ , మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రెహ్మాన్ అధ్యక్షతన ఏర్పాటుచేసినారు, కార్యక్రమనికి ముఖ్య అతిథి గా సంగెం మండల ఎంపీపీ కందకట్ల కళావతి హాజరై మాట్లాడుతూపిల్లలకు పాఠ్యపుస్తకాలు మరియు స్కూలు యూనిఫార్మ్స్ పాఠశాల ప్రారంభోత్సవం రోజే పంపిణీ చేయటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్య మంత్రి గౌరవనీయులురేవంత్ రెడ్డి మరియు పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సంగెం మండలంలోని అన్ని పాఠశాలలకు మౌఖిక వసతులకు గాను సుమారు 1 కోటి 50 లక్షల నిధులను మంజూరీ చేయించినారు. అట్టి పనులను అమ్మ ఆదర్ష పాఠశాల కమిటీల ద్వారా పనులను వేగంగా పూర్తి చేయించటం జరుగుతున్నది అని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంనిర్దేశించిన గడువుకు ముందే స్కూల్ యూనిఫార్మ్స్ స్టిచ్చింగ్ చేసి అందించిన స్వయం సహాయక బృందాల మహిళలను మరియు సెర్ప్, డీఆర్డీఏ సిబ్బందిని అభినందించారు.పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాదించినందుకు ఉపాద్యాయులను అభినందించి, పాఠశాల టాపర్ గా నిలిచిన విద్యార్థిని నిరాటినక్షేత్రను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గవిచర్ల ఎంపీటీసీ గూడ సంపత్ రెడ్డి ,సంగెం ఎంపీటీసీ మెట్టిపల్లి మల్లయ్య మాజీ సర్పంచ్ కందకట్ల నరహరి అచ్చ నాగరాజు ఏపిఎం కిషన్ ఏఏపిసి చైర్ పర్సన్ సంగెం ప్రవళిక ,మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాల చైర్మెన్ రాధిక్ ,ఎంపీపీ ఎస్ హెడ్మాస్టర్ కుమారస్వామి మరియు రెండు పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
