జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా..
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

JEE Mains 2024 Toppers List: జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. ఏకంగా 22 మందికి వంద పర్సంటైల్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జేఈఈ మెయిన్ 2024 సెషన్-2 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాదాపు 12.57 లక్షల మంది అభ్యర్ధులకు 319 నగరాల్లో ఏప్రిల్ 4 నుంచి 12 వరకు ఈ పరీక్షలు జరిగాయి.
వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులే 22 మంది దాకా ఉన్నారు. తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు విద్యార్థులు వంద పర్సెంటైల్ సాధించారు. గతేడాది 43 మంది అభ్యర్ధులు వంద పర్సెంటైల్ సాధించారు. ఏప్రిల్ 22న జేఈఈ మెయిన్ తుది ఆన్సర్ కీ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), ప్రకటన తేదీ కంటే ఒక రోజు ముందుగానే రిజల్ట్స్‌ను విడుదల చేసింది.
2,50,284 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక.. ఏప్రిల్ 27 నుంచి దరఖాస్తులు
కాగా జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులను కూడా ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దీంతో ఈ ఏడాది మొత్తం 2,50,284 అభ్యర్ధులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించినట్లు వెల్లడించింది. జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారన్న సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.
అర్హత సాధించిన వారంతా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు మే 17 నుంచి 26 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 26వ తేదీన రెండు సెషన్లలో ఈ పరీక్ష జరుగుతుంది. ఉదయం సెషన్‌లో పేపర్ 1 పరీక్ష 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌లో పేపర్ 2 పరీక్ష 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు జూన్ 9న విడుదల అవుతాయి.
