వినాయకుడి నిమర్జన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు శ్రీ వర్రీ తులసీరామ్ విజయకుమార్ గారు.

చేవెళ్ల కేంద్రంలోని శాంతినగర్ బిజెపి కార్యాలయంలోని వినాయకుడి నిమర్జన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు శ్రీ వర్రీ తులసీరామ్ విజయకుమార్ గారు.

నిమర్జనం అనంతరం బిజెపి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొని వారు మాట్లాడుతూ

కర్ణాటకలో అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అక్కడ చేతులెత్తేసింది ఇప్పుడు తెలంగాణలో అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తోందని అని అన్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయం చేస్తుందని అన్నారు.

ఓటర్ కార్డు ఉంటేనే పథకాలు అమలు అవుతాయని లేకపోతే దరఖాస్తులు తీసుకోరని ఇష్టా రాజకీయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు ప్రవర్తిస్తోంది అని అన్నారు.

పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు ప్రజలకు అందడం లేదు.

కొంత మందికే దళిత బంధు, కుల వృత్తుల వారికి చేయూత అని అరకొరగా నిధులు, పూర్తికాని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గృహలక్ష్మి పేరిట కొత్త మోసంతో బిఆర్ఎస్ ప్రభుత్వం నేడు రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో బిజెపి చేవెళ్ల మండల్ జనరల్ సెక్రెటరీ అనంత్ రెడ్డి, శంకర్పల్లి మండల ప్రెసిడెంట్ రాములు గౌడ్, షాబాద్ మండల ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, చేవెళ్ల మండల ఉపాధ్యక్షుడు కృష్ణ గౌడ్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అల్లవాడ శ్రీనివాస్ రెడ్డి, బిజెపి ప్రధాన కార్యదర్శి మధుకర్, బీజేవైఎం ఉపాధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, దళిత మోర్చా అధ్యక్షుడు యర్రవల్లి అశోక్, బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ బండారి చంద్రశేఖర్ రెడ్డి, జి మహేశ్వర్ రెడ్డి, బర్ల కృష్ణ, సోషల్ మీడియా ప్రెసిడెంట్ అల్లవాడ అభిషేక్ రెడ్డి, మిట్టు, ఉబ్బటి సత్యం, జయసింహ, రాములు, చాకలి శ్రీనివాస్, రాజేందర్ గౌడ్, మహేందర్ ,రాములు, ప్రశాంత్ చారి, నితిన్ చారి మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

You may also like...

Translate »