కరకట్ట నిర్మణ పనులతో పంట పొలాలకు నష్టంజరుగుతుందని రైతుల ఆవేదన…
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

కరకట్ట నిర్మణ పనులతో పంట పొలాలకు నష్టంజరుగుతుందని రైతుల ఆవేదన…
న్యాయం చెస్తానని హామీ ఇచ్చిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు
జ్ఞాన తెలంగాణ / భద్రాచలం.మే 30 :
భద్రాచలం కునవరం రోడ్ నందు కరకట్ట నిర్మణ పనులు జరుగుతుండగా పంట పొలాలకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట పరిహారం చెల్లించాలని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి వారి సమస్యలను స్థానిక నాయకులు రత్నం రమాకాంత్ ఫోన్ ద్వారా శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సంఘటన స్థలానికి పర్యవేక్షరించమని తెలియజేశారు. అధికారులు ఫోన్లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు గారికి రైతుల సమస్యలను వివరించగా, తాను హైదరాబాదులో ఉన్నానని, రెండు రోజుల్లో భద్రాచలం చేరుకొని సంఘటనా స్థలానికి వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. దీనితో రైతులు వారి పనులు ప్రారంభించుకోమని కరకట్ట నిర్మాణ కాంట్రాక్టర్ వారికి తెలియజేశారు. వెంటనే స్పందించిన తెల్లం వెంకట్రావు గారికి సంబంధిత రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రత్నం రమాకాంత్, చిట్టిబాబు, నర్రా రాము, పుల్లగిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
