పీజీ సెంటర్లలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులు
- ఓటు చోర్–దేశ్ బచావో ప్రచారానికి టీపీసీసీ సమన్వయకర్తల నియామకం - October 22, 2026
- నీళ్లున్నా రైతులకు కరువేనా? రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై ప్రవీణ్ కుమార్ ధ్వజం! - October 22, 2026
- బతుకమ్మ వేడుకల్లో దాడి .. బాధితులకు అండగా మందకృష్ణ మాదిగ! - October 22, 2026

జ్ఞానతెలంగాణ,ఉస్మానియా యూనివర్సిటీ,ప్రతినిధి :
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ సెంటర్లలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ పీజీ కాలేజెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ అప్లికేషన్స్, కెమిస్ట్రీ, లైబ్రెరీ సైన్స్, ఇంగ్లీష్ తదితర విభాగాలలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. పీహెచ్డీ, ఎంఫిల్లతో పాటు నెట్, సెట్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పోస్టుల భర్తీని పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు పూర్తి వివరాలతో ఈ నెల 24వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
