వరంగల్ నల్లబెల్లి మండలం.

వరంగల్ నల్లబెల్లి మండలం.
ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల బి.ఆర్.ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారి విజయానికి కృషి చేయాలి.
నేడు నల్లబెల్లి మండలం పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు సమావేశంలో కోరిన బి.ఆర్.ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బానోత్ సారంగపాణి గారు.
ప్రియతమ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం. నేడు మండల పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. నేటి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అమలు గాని హామీలతో ప్రజలను మోసం చేసిందని, జనరల్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ యొక్క వక్రబుద్ధి ప్రజలందరూ గమనిస్తున్న సందర్భంగా…. మరోసారి వస్తున్న ఈ ఎంఎల్సి ఎన్నికల్లో ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించి, ప్రశ్నించాలని నిరుద్యోగులకు మరియు పట్టబద్రుల ఓటర్లందరినీ ఈ సందర్భంగా అభ్యర్థించడం జరిగింది.
ఎమ్మెల్సీ పట్టబద్రుల ఎన్నికల్లో బి. ఆర్ .ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారి గెలుపుకై పార్టీ కార్యకర్తలు తప్పక కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతూ..
మండలంలోనీ పట్టబద్రులందరూ రాకేష్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఓటింగ్ లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలోమాజీ ఎంపీపీ కక్కేర్ల శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్ గారు, క్లస్టర్ ఇన్చార్జి లు గందే శ్రీనివాస్ గుప్తా గారు,ఇంగ్లి శివాజీ గారు, మామిళ్ళ మోహన్ రెడ్డి గారు, ఎంపీటీసి జన్ను జయరావు గారు, క్యాతం శ్రీనివాస్ గారు,సట్ల శ్రీనివాస్ గారు, నన్నే సాహెబ్ గారు, గుమ్మడి వేణు గారు మరియు పార్టీ ముఖ్య నాయకులు యువజన సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.