భువనగిరి పార్లమెంటు పరిధిలో చతుర్ముఖ పోటీ లో సిపిఎం గెలవబోతుంది….

మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మవద్దు…
భారీ మెజారిటీతో జహంగీర్ ను గెలిపించండి…
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు.
జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 28
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జరుగుతున్న ఎన్నికల్లో చతుర్ముఖ పోటీలో సిపిఎం గెలవబోతుందని సిపిఎం పై మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్న భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు
ఆదివారం రోజున వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్ పురం గ్రామంలో సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ గెలుపును కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు ప్రజల్లో మంచి స్పందన వస్తుందని నాలుగు పార్టీల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల సమరంలో జహంగీర్ విజయాన్ని సాధించబోతున్నారని జహంగీర్ గెలవడం ద్వారా ఈ ప్రాంత ప్రజలను దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం రాబోతుందని ప్రజలందరూ ఈ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు
రాష్ట్రవ్యాప్తంగా 16 ఎంపీ స్థానాల్లో సిపిఎం పోటీలో లేదని కేవలం భువనగిరి పార్లమెంటు లో మాత్రమే పోటీ చేస్తున్నామని భువనగిరి పార్లమెంట్ మినహాయించి మిగతా 16 స్థానాల్లో సిపిఎం ఇండియా కూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుందని భువనగిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తుల కలయిక లేదని తెలిపారు
సిపిఎం అభ్యర్థి పై ప్రజల్లో వస్తున్న విస్తృత స్పందనను చూసి ఓర్వలేక తప్పుడు కథనాలు మీడియాలో సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని కోరారు సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ భువనగిరి పార్లమెంట్ పరిధిలోని 30 మండలాల ప్రజలతో గత 35 సంవత్సరాలుగా ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వ్యక్తిగా నిరంతరం అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న వ్యక్తిగా అందరికీ పరిచయం ఉన్నారని ఈ ప్రాంతంలోని సాగు,తాగునీరు,మూసి జల కాలుష్యం,స్థానిక పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇండ్లు లేని పేదలకు ఇండ్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్లతో వివిధ వృత్తులకు చెందిన ప్రజల దీర్ఘకాలిక,తాత్కాలిక సమస్యలపై పోరాటాలు నిర్వహించి అనేక విజయాలు సాధించాడని ఈసారి ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు భువనగిరి పార్లమెంట్లో ప్రజలు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు చీర్క శ్రీశైలం రెడ్డి, మండల నాయకులు వేముల నాగరాజు,నాయకులు రేపాక ముత్యాలు,బంధారపు ధనంజయ,రాగిరు కృష్ణస్వామి, వేముల జ్యోతిబసు, చీర్క లక్ష్మమ్మ,వనగంటి స్వామి, తదితరులు పాల్గొన్నారు
