తెలంగాణ హైకోర్టు కు శాశ్వత న్యాయమూర్తులు
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

తెలంగాణ హైకోర్టు కు శాశ్వత న్యాయమూర్తులు
న్యూఢిల్లీ:తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావులను శాశ్వత న్యాయ మూర్తులుగా నియమించ డానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తు లుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించిందని తెలిపింది. ముఖ్యమంత్రి, గవర్నర్‌లు దీనికి తమ సమ్మతి తెలియజేశారని పేర్కొంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్ర చూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ బీఆర్.గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్‌రావులకు తగిన అర్హతలు కలిగి ఉన్నారని నిర్ణయించినట్టు వెల్లడించింది.
తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ ఇద్దరు న్యాయమూర్తుల తీర్పులు పరిశీలించాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు కమిటీని సీజేఐ ఆదేశించారని.. ఆ కమిటీ ఆయా తీర్పులపై సంతృప్తి వ్యక్తం చేసిందని వివరిం చింది.
