డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే కాంగ్రెస్ పార్టీ కి భయం ఎందుకు?

డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే కాంగ్రెస్ పార్టీ కి భయం ఎందుకు?
75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 56 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి
తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భయం పట్టుకుంది.
మహనీయుల ఆశయాలతో దృఢమైన సంకల్పంతో మహనీయుల ఆలోచన విధానాన్ని ప్రతి గడపకు చేరుస్తూ, 56 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను ప్రతి గడపకు వెళ్లి చెబుతూ వారి లోపల గుణాత్మకమైన మార్పును తీసుకొస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే కాంగ్రెస్కు భయమే
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో చేరినప్పుడు లైట్ తీసుకున్న ఈ పార్టీ ఇప్పుడు ఆయనకు గజగజ ఉనికి పోతుంది కారణం 75 సంవత్సరాలుగా హస్తం గుర్తు తప్ప ఏనుగు గుర్తు ఎరుగని పేద బిడ్డలకు సైతం ఏనుగును పరిచయం చేస్తున్నాడు, వారికి జరిగిన అన్యాయాన్ని
కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలుగా కులాలుగా మతాలుగా వర్గాలుగా విభజించి ఎవరిని కలవనీయకుండా ఏ కులానికి ఆ పథకం, వర్గానికి ఒక పథకం అంటూ మాయ మాటలతో అణగారిని బిడ్డల నోట్లలో మట్టి కొడుతూ బడా బాబుల కడుపులు నింపి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతూ వస్తుంది.

ఈ పరిణామాలన్నీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు ప్రతి పేద వాడి వద్దకు ప్రత్యేక్షంగా వెళ్లి ఈ విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే కాంగ్రెస్ పార్టీకి వణుకు పట్టుకుంది. ఇన్నాళ్లు ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే వేసిన దళిత బిడ్డలు నేడు బహుజన్ సమాజ్ పార్టీ వైపు చూస్తున్నారు. వారికి సరైన అవగాహన ఉంది వారి భవిష్యత్తుకు చక్కటి దిశనిర్దేశం చేయగలనటువంటి ఒక వ్యక్తి తమ వర్గం నుంచి రావడం ఆయన ఒక మంచి విజన్ తో ఉండడం ఇప్పటికే ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలను పేద బిడ్డలకు అందించినటువంటి కార్యరూప శిల్పిగా అతని చూస్తున్నారు.
ఎక్కడ తమ ఓట్లు పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ చీల్చి తమల్ని రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో బొంద పెడుతుందో అన్న భయం తో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద అసత్య ఆరోపణలకు తెర లేపారు కాంగ్రెస్ అధ్యక్షులు.

25 ఏళ్లుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని నడిపిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు తన ఉద్యమాన్ని రాజకీయ శక్తిగా మార్చడానికి ప్రయత్నం చేశారు, ఒకానొక దశలో బహుజన వాదానికి విరుగుడుగా మహాజనవాదాన్ని తెర మీదికి తెచ్చాడు కానీ అది ఫలించలేదు,

డాక్టర్ విశారదన్ దాదాపు 14 సంవత్సరాలుగా ప్రజా చైతన్య యాత్రలు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు కానీ వారు రాజకీయ శక్తిగా మార్చలేకపోయారు 14 సంవత్సరాల చైతన్యం ప్రస్థానం హుజురాబాద్ మునుగోడు ఎలక్షన్స్ లో తమ శక్తిని ప్రదర్శించలేకపోయింది, పదివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి 10 లక్షల మందితో సభ పెడతానని 5000 మందితో సభ పెట్టిన తీరు కాంగ్రెస్ పార్టీని భయపెట్టలేకపోయింది.
డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ లో చేరి బహుజన ఉద్యమాన్ని పరుగులు పెట్టిస్తున్న తరుణంలో అయన BSP లో చేరిన రెండు సంవత్సరాలకు విశారాధన్ DSP పార్టీ పెట్టారు దానికి ఎన్నికల గుర్తు లేకపోవడం తో అంతగా ప్రభావం చూపదు.

వీరందరి కంటే ముందుగానే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కరీంనగర్ SP గా ఉన్నప్పుటి నుండి చాల రకాల కార్యక్రమాలతో ప్రజల నాయకుడిగా ఏదిగాడు,స్వేరోస్ సంస్థ పెట్టి 16 రాష్ట్రాల్లో అవసరానికి అనుగుణంగా 20 సంఘాలను పెట్టి ప్రతీ సంఘం రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు విస్తరించి, స్వేరోస్ చెమట చుక్కలను డబ్బులుగా మర్చి లక్షలాది పేద బిడ్డలకు చదువును అందించి దేశ చరిత్రలో గొప్ప ఖ్యాతి గడించాడు.
అక్షరం, ఆర్థికం ఆరోగ్యం అనే సిద్ధాంతాలను 9 సంవత్సరాలు నడిపి, పేదల జీవితాలు సమూలంగా మారాలంటే రాజ్యాధికారం ద్వారా మాత్రమే సాధ్యమని తన ఏడున్నర సంవత్సరాల పదవిని రాజీనామా చేసి ప్రజా క్షేత్రం లోకి వొచ్చాడు.

అంటే కేవలం 9 సంవత్సరల లోనే రాజకీయ శక్తి గా మార్చగాలిగాడు ఇదే అధికార ప్రతీ పక్షాలకు నిద్ర లేకుండా చేస్తుంది.
తెలంగాణలో ఎంతోమంది మేధావులు కవులు కళాకారులు రాజకీయ శక్తిగా మార్చాలని ప్రయత్నం చేశారు కానీ వారు ప్రజా క్షేత్రంలో దిగి రణరంగంలో రాజకీయ చతురతని ప్రజలలో రగిలించి, ఓటు చైతన్యాన్ని చేసి తమ సమాజానికి రాజాధికారాన్ని అందించాలన ప్రయత్నం చేయలేకపోయారు
తాను పార్టీలో చేరినప్పటి నుండి నేటి వరకు బహుజన రాజ్యాధికారం పేరుతో ప్రతి గడపను తిరుగుతున్నాడు ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నాడు దాదాపు ఇప్పటికే కొన్ని లక్షల మందిని ప్రత్యక్షంగా కలిసినటువంటి గొప్ప వ్యక్తిగా, వారి జీవితాలలో సమూలమైన మార్పు రావాలంటే ఏ ఏ పథకాలను ప్రవేశపెట్టాలని గ్రౌండ్ నుంచి చూసినటువంటి గొప్ప జ్ఞానిగా, ఫార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసి బాబాసాహెబ్ ఆలోచనను ఉనికిపుచ్చుకున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నటువంటి పథకాలను కాపీ కొట్టాల్సిన దుస్థితి కాంగ్రెస్ పార్టీకి దాపురించింది.

ఒకవైపు రేవంత్ రెడ్డి గారు దళిత బిడ్డ ఎందుకు రాజకీయాల్లోకి రావద్దా..?
అంటూనే వెన్నుపోటు రాజకీయాలు మొదలెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ ఎదుగుతున్న కొద్దీ రేవంత్ రెడ్డికి వారి అధినాయకులకు వణుకు మొదలైంది.
ఒకానొక దశలో మేము బహుజన సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నామనేటటువంటి విషయాన్ని
ప్రజా వేదికగా చెప్పే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు, మరో దశలో బహుజన్ సమాజ్ పార్టీ తో పొత్తు పెట్టుకుని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని ఆశాభావాన్ని నింపారు, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తరువాత వారు, మళ్లీ మాట మార్చి దళితున్ని సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా దగ్గర భట్టి విక్రమార్కుని ఆ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నామని తెలిపినారు, తదనంతరం అమెరికా పర్యటనకు వెళ్లినటువంటి రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా సీతక్కను ప్రతిపాదిస్తూ వచ్చాడు. దళిత సీఎం నీ చేస్తానని కేసీఆర్ మోసం చేశాడు కాబట్టి తాము చేసి చూపిస్తామని నొక్కి చెబుతూ మోసం చేస్తూ వొచ్చాడు. మా దగ్గరనే ఒక సీఎం అభ్యర్థిగా దళితుడిని పెడుతున్నాం కాబట్టి మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఒక వాదనను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చాడు.
ఇవన్నీ ముందుగానే పసిగట్ట గలిగిన మాజీ పోలీస్ ఆఫీసర్ గా, హార్వర్డ్ విశ్వవిద్యాల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి ఒక గొప్ప జ్ఞానిగా
ఎప్పటికప్పుడు కాంగ్రెస్ వ్యూహాలను ముందుగానే పసిగట్టి వాటిని తిప్పి కొడితేనే ఉన్నారు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు,

తమ జాతీయ నాయకురాలు మాయావతి గారి నిర్ణయమే తమ నిర్ణయమని వారు తీసుకున్న ఏ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, బహుజన బావ సరూప్యత కలిగినటువంటి పార్టీలతో కలిసి పని చేస్తామని ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.
మాదిగ పార్టీగా ముద్ర వేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి పార్టీ నాయకులు, అయినా తన మేధోమధనం,ఓపికగా,సహనంతో మాదిగల పార్టీగా ముద్రవేయాలనుకున్నటువంటి ఈ పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తూ బహుజన సమాజ్ పార్టీ బీసీల పార్టీగా బీసీల గుండెల్లోకి తీసుకెళ్లగలిగాడు.
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఓట్లు, బీసీ ఓట్లు, ఎస్ టి ఓట్లు, మత మైనారిటీల ఓట్లు పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీకి పోలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ విశ్లేషణ సంస్థలు చెబుతున్నాయి.
ఒకవేళ ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ బలమైన శక్తిగా మారనుంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చక్రం తిప్పబోతున్నాడు, 2024 ఎలక్షన్లో కచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప గెలవలేమనేటటువంటి విశేషణలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ నిర్ణయాన్ని జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారికి వదిలేశారు.
ఏది ఏమైనా 119 నియోజకవర్గాలలో బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓట్లను పూర్తిగా తమ వైపుకు తిప్పుకోవడంలో సఫలమైనట్టే, ఒక్క రూపాయి పంచకుండా, ఒక మందు సీసా పంచకుండా ప్రతి నియోజకవర్గంలో 30 వేల నుంచి 40 వేల ఓట్లు పడనున్నాయంటే మామూలు విషయం కాదు, హోరాహోరీ పోటీలో ప్రతి ఓటు పార్టీ ల స్థితిని నిర్ణయించగలదు.
హార్వర్డ్ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి గొప్ప మేధావిగా విద్యా సమస్యలపై నాటి నుండి నేటి వరకు గళం విప్పుతూనే ఉన్నాడు తన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,
మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా పోరాడుతున్నప్పటికీ, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్న పోరాటం వల్లనే విద్యార్థులకు సరైన న్యాయం జరుగుతుంది, ఆయన సంధిస్తున్న బాణాలు ఆయన, ప్రతి సమస్యను ప్రజల ముందుకు తీసుకుపోతున్నటువంటి విధానము ఆయనకు గొప్ప క్రెడిట్ ను తీసుకొస్తుంది, టిఎస్పిఎస్సి ఇష్యూ కానీ, గ్రూప్ 2 కానీ, మొదలైన ఎన్నో విజయాలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దీక్ష వల్లనే సాధ్యమయ్యాయి,అందుకే నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు, విద్యార్థులు ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అందరు కూడా పూర్తిగా బహుజన సమాజ్ పార్టీకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు అని సర్వే సంస్థలు కుండ బద్దలు కొట్టినట్టు చెబుతునే ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పూర్తిగా బహుజన సమాజ్ పార్టీ వైపే ఉన్నట్టు ప్రపంచ దిగ్గజ సర్వే సంస్థలు చెబుతున్నాయి.
అందుకే రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రవీణ్ కుమార్ గారిని అదుపు చేయాలని లేదంటే తమ పార్టీ ఉనికి లేకుండా పోతుందని గుబులు చెందుతున్నారు,
ఏది ఏమైనా బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు తమ శక్తిని ప్రదర్శిస్తూ ఎంతోమంది మేధావులను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంది. ఇదంతా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చరిష్మా మాత్రమే. రాబోయే ఎలక్షన్ లో దాదాపు 23 సీట్లు బహుజన్ సమాజ్ పార్టీ గెలవబోతున్నట్టు, సర్వే సంస్థలు చెబుతున్నాయి ఇది ఇలా ఉంటే ఆ మిగిలిన నియోజకవర్గాల్లో దాదాపు గంపగుత్తగా 40 వేలకు పైగా ఓట్లు డబ్బులు పల్చకుండా పడబోతున్నట్టు సర్వే సంస్థలు చెబుతున్న తీరు అందరిని కలవరపెడుతుంది.