శంకర్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి


  • ఆదర్శ్ బ్యాంక్ భవనం రెండో అంతస్తులో పేకాట నిర్వహణ ఆరోపణలు
  • పోలీసుల దాడిలో నలుగురు అదుపులోకి వచ్చినట్లు సమాచారం
  • మరో ఇద్దరు పరారైనట్లు ప్రచారం
  • రూ.31,270 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం
  • పేకాట వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలనే డిమాండ్

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి, అక్టోబర్ 26: శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 25న ఉదయం 11 గంటల సమయంలో ఆదర్శ్ బ్యాంక్ భవనం రెండో అంతస్తులో పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ దాడి చేపట్టినట్లు తెలిసింది.
ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని గుర్తించగా, నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పోలీసుల దాడి సమయంలో పరారైనట్లు సమాచారం. పేకాట స్థావరంలో రూ.31,270 నగదు, ఒక సెట్ పేక ముక్కలు, ఒక స్కోర్ కార్డు, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, తదుపరి దర్యాప్తు వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like...