కొల్లూరు ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
- కొల్లూరు ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి - October 25, 2026
- ఆర్టీసీ గుర్తింపు వివాదం.. ఈయూ మహాధర్నాకు టీఎంయూ మద్దతు - October 25, 2026
- హైదరాబాద్లో రూ.600కే వీక్లీ బస్ పాస్! - October 25, 2026
జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి జిల్లా: కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ట్యాంకర్, ఆటో ఢీకొన్న ఘటనలో మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తితోపాటు ఆటో డ్రైవర్ శ్రీనివాస్ మృతిచెందారు. రోడ్డు పక్కన మొక్కలకు నీరు పోస్తున్న సమయంలో ట్యాంకర్, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుల వివరాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
