బాన్సువాడలో వైభవంగా రావణదహనం..
- ప్రతి మహిళ దుర్గాదేవిలా హిందూ సంస్కృతిని, దేశాన్ని రక్షించాలి - October 22, 2026
- పొద్దుటూరు గ్రామంలో ఘనంగా పండగల సాయన్న జయంతి వేడుకలు
- October 22, 2026 - అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏడుపాయలలో భవాని మాత నిమజ్జనం - October 22, 2026

- విజయదశమి వేడుకల్లో పోచారం శ్రీనివాసరెడ్డి
- వరుసగా 16వ ఏడాది నిర్వహణ.. పోచారం గ్రామంలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు
జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి, అక్టోబర్ 21:
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో మంగళవారం రావణదహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను వీక్షించారు.ఉమ్మడి జిల్లాల మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 16వ సంవత్సరం నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాన్సువాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రావణదహనంతో మినీ స్టేడియం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.అనంతరం బాన్సువాడ గ్రామీణ మండలంలోని పోచారం గ్రామంలో హనుమాన్ మందిరం వద్ద జమ్మి చెట్టుకు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులకు జమ్మి ఆకులను పంపిణీ చేసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కాసుల విజయ తదితరులు పాల్గొన్నారు.
