తాండ్ర గ్రామంలో శ్రీకృష్ణ హోమం – ఆధ్యాత్మిక భక్తి మార్గదర్శకతే జీవితానికి మార్గం.. మార్కెట్ చైర్మన్ సంజీవ్ యాదవ్
- నిరుద్యోగులకు శుభవార్త – సుంకిరెడ్డి జాబ్ డ్రైవ్ కు భారీ స్పందన.! - September 10, 2026
- పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి శ్రేయస్కరం – మున్సిపాలిటీ చైర్మన్ సత్య నాయక్ - September 10, 2026
- కరెంటు కోతలతో రైతన్న ఆగ్రహం – తాండ్ర గేట్ హైవే బ్లాక్.! - September 10, 2026
కల్వకుర్తి సెప్టెంబర్ 09 :కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలోని శ్రీ కృష్ణ దేవాలయంలో శ్రీ కృష్ణ హోమం వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ.. భక్తి, ఆధ్యాత్మికతే మనిషి జీవితానికి మార్గదర్శకమని,ఇలాంటి హోమాల వల్ల గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని అన్నారు.భగవంతుని ఆశీస్సులతోనే అభివృద్ధి సాధ్యమని, యువత ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జియగూడ యాదవ సంఘం అధ్యక్షుడు జక్కుల చిన్న జంగయ్య యాదవ్, భైరాపూర్ సర్పంచ్ రాజు యాదవ్, నారాయణ,శ్రీను యాదవ్, రామ్ కోటి, లక్ష్మణ్ యాదవ్, తిరుపతి యాదవ్, మల్లయ్య యాదవ్, మైబు యాదవ్,విష్ణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
