శంకర్పల్లి పురపాలక సంఘం: 40 నామినేషన్లు స్వీకరణ

శంకర్పల్లి పురపాలక సంఘ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేడు అనగా 29 జనవరి 2026 తేదీన శాంతియుతంగా, సజావుగా ముగిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ నామినేషన్ల స్వీకరణ నిర్వహించారు.శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులకు సంబంధించి రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను సమర్పించారు. నామినేషన్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగిందని ఎన్నికల అధికారులు తెలిపారు.నామినేషన్లలో మహిళలు, యువత, అనుభవజ్ఞులైన అభ్యర్థులు సమానంగా పోటీలోకి దిగడం గమనార్హం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, యూఆర్ రిజర్వేషన్ కేటగిరీలకు అనుగుణంగా అభ్యర్థులు పోటీ చేయడం ద్వారా స్థానిక స్వయంప్రభుత్వ సంస్థల్లో సామాజిక ప్రతినిధిత్వం స్పష్టంగా కనిపిస్తోంది.
పార్టీ వారీగా నామినేషన్లను పరిశీలిస్తే :
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) నుంచి 18,
భారత రాష్ట్ర సమితి (BRS) నుంచి 10,
భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి 6,
బహుజన ఇన్సాఫ్ పార్టీ (BIP) నుంచి 1,
స్వతంత్ర అభ్యర్థులు నుంచి 5 నామినేషన్లు దాఖలయ్యాయి.
మొత్తం 40 నామినేషన్లు అధికారికంగా స్వీకరించబడ్డాయి.
