గ్రూప్-1 పరీక్షకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025
గ్రూప్-1 పరీక్షకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు
• జిల్లా వ్యాప్తంగా 17 సెంటర్లలో పరీక్ష రాయనున్న 4473 మంది అభ్యర్ధులు..
• ఉదయం 10 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోనికి అనుమతి లేదు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ……జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి శ్రీ కిరణ్ ఖరే ఐ పి ఎస్
జ్ఞానతెలంగాణ,భూపాలపల్లి, జూన్ 07:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టి.జి.పి.యస్.సి.) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ –I ప్రిలిమినరీ పరీక్షకు పోలీసు శాఖ తరపున్న అన్నిరకాల భద్రత పరమైన ఏర్పాట్లు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 17 సెంటర్లలో మొత్తం 4473 మంది అభ్యర్ధులు పరీక్ష రాయనున్నారని, పరీక్షకు వచ్చే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుదని, పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాలలో సభలు, ఊరేగింపులు, ర్యాలీలు లాంటివి నిర్వహించ కూడదని, అనవసరంగా గుంపులు గుంపులుగా ఎవ్వరూ కూడా పరీక్ష కేంద్రం పరిసరాలలో తిరగటానికి అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి జిరాక్స్ షాపులు తెరిచి ఉంచరాదని షాపు యజమానులకు సూచించారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని, అభ్యర్ధులు బయోమెట్రిక్, వెరీఫికేషన్ సిబ్బందికి సహకరించవలసిందిగా ఎస్పి కోరారు.
అభ్యర్ధులకు సూచనలు:-
• పరీక్ష రోజున ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రం లోనికి అనుమతి ఇస్తారని, 10 గంటలకు పరీక్షా కేంద్రం గెట్ మూసివేయడం జరుగుతుందని, 10 గంటల తర్వాత ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన ఎవ్వరిని లోపలికి అనుమతించడం జరగదు.
• ఎగ్జామ్ కు వచ్చిన అభ్యర్థులు హాల్ టికెట్ నందున్న నియమనిబంధనాలు తప్పకుండా పాటించాలన్నారు.
అభ్యర్ధులు హాల్ టికెట్ తో పాటు ఒక కలర్ ఫోటో, ఒరిజినల్ ఆధార్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్/ఉద్యోగి గుర్తింపు కార్డ్/ఓటర్ గుర్తింపు కార్డ్ ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకొని రావాల్సి ఉంటుందని అన్నారు.
• హాల్ టికెట్ నందు ఫోటో సరిగ్గా కనిపించకపోయినట్లైతే 3-కలర్ ఫోటోలు తీసుకొని, హాల్ టికెట్ పై గెజిటెడ్ అధికారి సంతకం చేయించుకొని రావలసిఉంటుంది.
• అభ్యర్ధులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందస్తుగా చూకున్నట్లైతే, పరీక్ష రోజు పరీక్ష కేంద్రానికి సులువుగా చేరుకోవచ్చు.
• ఎగ్జామ్ రాయడానికి (బబ్లింగ్) బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ను మాత్రమే అనుమతిస్తారని అన్నారు.
• ఎగ్జామ్స్ హాల్ లోనికి మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్స్, వైట్ పేపర్స్, పెన్ డ్రైవ్స్, టాబ్లెట్స్, హియరింగ్ సొల్యూషన్స్ సంబంధించిన గాడ్జెట్స్ అనుమతించడం జరగదన్నారు.
• ఎగ్జామ్ పూర్తి అయిన తర్వాత ఒంటిగంట వరకు ఎవ్వరిని బయటకు పంపడం జరగదని, అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రశ్నాపత్రం తమతో పాటు తీసుకు వెళ్ళడానికి వీలుగా ఉంటుందని పేర్కొన్నారు.
• అభ్యర్థులు ఎవరైనా మాల్ ప్రాక్టీస్, మాస్ కాపింగ్ చేసినట్లు తేలితే చట్ట రిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పి కిరణ్ ఖరే హెచ్చరించారు.
