రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
జ్ఞాన తెలంగాణ మే 28, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. మంగళవారం నాడు స్థానిక సుందరయ్య భవన్ నందు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం అధ్యక్షుతన జరిగిన సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సమావేశంలో పోతినేని పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించిందని, తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో పంటల సాగుకు అప్పుల కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. తీసుకున్న అప్పులు తీర్చలేక ప్రభుత్వం రాయితీ చెల్లించకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడంలేదన్నారు. దీంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. పండిన పంట విక్రయిస్తే వడ్డిలకే సరిపోతోందన్నారు. పంట సీజన్ ప్రారంభమైంది కాబట్టి వెంటనే నూతన రుణాలు మంజూరు చేయాలని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలైన ఆరు గ్యారెంటీల అమలు చేయాలని కోరారు. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. సకాలంలో రైతుబంధు, రైతు బీమా, పింఛన్లు, అన్నదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వంటి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చి పూర్తిస్థాయిలో అమలయ్యే విధంగా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో సొంత ఇంటి నిర్మాణం పథకాన్ని అటకెక్కించారని తక్షణమే కాంగ్రెస్ ఇచ్చిన హామిలో భాగంగా రాష్ట్రమంతా అర్హులైన పేదలను గుర్తించి , అందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని స్థలమున్నవారికి ఇందిరమ్మ ఇంటి పథకం పేరుతో ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శవర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై. విక్రమ్, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
