నకిలీ విత్తనాల పై రైతులకు అవగాహన కార్యక్రమం

జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
రూరల్ మే 25.

ఈరోజు కల్వల గాంధీపురం గ్రామాలలో రైతులకు నకిలీ విత్తనాల గురించి అవగాహన ఏఈఓ మేఘన అధ్యక్షతన రైతులకు మంచి రకాల విత్తనాలు వేసుకోవాలని లైసెన్స్ గల షాపులో విత్తనాలు కొనుక్కోవాలని విత్తనాలు కొనేటప్పుడు బిల్లు మరియు లాట్ నెంబరు రేటు ఉండాలని బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఆ బిల్లు పంటకాలం అయిపోయే వరకు దగ్గర ఉంచుకోవాలని సూచించారు గ్రామాలలో కానీ ఎక్కడైనా లూస్ గింజలు తీసుకోవద్దని హెచ్చరించారు మరియు రైతులకు జిలుగు అందుబాటులో ఉన్నదని రైతు బీమా గాని రైతుబంధు గాని వారు ఉన్నచో సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో గండి శ్రీనివాస్ చింతలూరి రమేష్ పాల శ్రీనివాస్ దొరికిన రామ్ నర్సయ్య,చీకటి. సతీష్ ఆకుల.సుధాకర్, పూనా. మురళి, వాసు దేవేందర్ రెడ్డి,బొగ్గుల. చంద్రం, బద్రులాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »