కదం తొక్కిన కందవాడ కాంగ్రెస్ నాయకులు ప్రజల బాగుకోసం పని చేసే నాయకుడు

కదం తొక్కిన కందవాడ కాంగ్రెస్ నాయకులు ప్రజల బాగుకోసం పని చేసే నాయకుడు రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటాం సినియర్ నాయకులు సోలిపురం భల్వంత్ రెడ్డి మాజీ సర్పంచ్ అరుంధతి సాయి రెడ్డి జ్ఞాన తెలంగాణ చేవెళ్ల మే 05 చేవెళ్ల నా ఆశా… నా శ్వాస అంటూ చేవెళ్ల ప్రజల బాగోగుల కోసం పని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం మనందరిపై ఉందని కందవాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు భల్వంత్ రెడ్డి అన్నారు. రంజిత్ రెడ్డికి మద్దతుగా ఆదివారం కందవాడ గ్రామంలో సోలిపురం బలవంత్ రెడ్డి,కందవాడ సర్పంచ్ అరుంధతి ఆధ్వర్యంలో నాయకులు సాయి రెడ్డి,జడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి, మల్గారి జనార్దన్ రెడ్డి, షేరి పెంటారెడ్డి, చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ ఆగి రెడ్డి,పిఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకటరెడ్డి గోనె ప్రతాపరెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మి మల్లారెడ్డి,సున్నపు వసంతం,మండల పార్టీ అధ్యక్షులు,ప్రచారం నిర్వహించి చేతి గుర్తుకు ఓటు వేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, చేవెళ్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కందవాడ గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
