పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే;

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే;
జ్ఞాన తెలంగాణ నారాయణపేట టౌన్ మే 5:మరికల్ మండలంలోని చింతకుంట గ్రామంలో మాజీ శాసనసభ్యులు ఎస్ ఆర్ రాజేందర్ రెడ్డి గారు మరియు మరికల్ మండల అధ్యక్షులు తిరుపతయ్య గారు పిఎసిఎస్ ప్రెసిడెంట్ G రాజేందర్ గౌడ్ గారు మరియు ముఖ్య నాయకులు ప్రసంగించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతుబంధు ఇవ్వకుండా రుణం రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని మాయమాటలు చెప్పి డిసెంబర్ 9 గడిచిన మళ్లీ ఆగస్టు 15 తారీకు వరకు చేస్తామని చెప్పడం ఆరు పథకాలతో మోసం చేసి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నారు విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పి మోసం చేశారు అని ఎస్సార్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మన శ్రీనివాస్ రెడ్డినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.