కాంగ్రెస్ వెంట కదులుదాం… పేదల కష్టాలు రూపుమాపుదాం!

కాం⁵గ్రెస్ వెంట కదులుదాం… పేదల కష్టాలు రూపుమాపుదాం!
– కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మిర్యాల రమేష్జ్ఞాన తెలంగాణ షాబాద్ ఈరోజు షాబాద్ మండలంలో మాచన్ పల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మరియు చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జ్ శ్రీ పామేనా భీమ భరత్ ఆధ్వర్యంలో ప్రచారం మరియు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించటకు మాచన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలను కార్యకర్తలను తరలించిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మిర్యాల రమేష్ గారు మాట్లాడుతూ ఈ సారి ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రం లో మాదిరిగానే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ విజయ కేతనం ఎగరేస్తున్న నేపథ్యం లో అత్యంత భారీ మెజారిటీ తో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని పార్లమెంట్ కు పంపాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ అభిమాని, కార్యకర్త, నాయకులు తీసుకోవాలని పిలుపునిచ్చారు.గత పదేళ్లుగా ప్రజలను దోచుకున్న దుష్ట బీజేపీ పాలనను గద్దె దించి ప్రజా శ్రేయస్సు కోరే కాంగ్రెస్ కు ప్రజలు అధికారం కట్ట బెట్టడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యం లో ప్రతి కార్య కర్త ప్రజల్లోకి వెళ్లి తెలంగాణ లో అధికారం లోకి వచ్చిన మూడు నెలల నుంచి జరుగు తున్న సంక్షేమ పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరి విలువైన ఓటును కాంగ్రెస్ వైపు మల్లించే దిశగా కటపడి పనిచేయాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. గత డెబ్బై ఏళ్ల లో కాంగ్రెస్ చేసిన అభివృద్ది ని సంక్షేమాన్ని నాశనం చేసి దేశాన్ని దివాళా తీయించిన బీజేపీ దుష్ట పాలనను అంత మొందించి , ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం పాటుపడే కాంగ్రెస్ కు అధికారం లోకి తీసుకుని రావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కోళ్ళ యదయ్య కూతురు చెంద్రయ్య కోళ్ల సుమన్ ప్రభాకర్ రెడ్డి కోళ్ల సంతోష్ మిరియాల కొమురయ్య నరేష్ గౌడ్ బొడ వెంకటయ్య శ్రీకాంత్ మోహన్ రెడ్డి మ్యాతరి వెంకటయ్య తదితరులు ,స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు, మహిళా నాయకులు అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు