తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు..
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు..
7 జిల్లాల్లో రూ. 253 కోట్ల స్కామ్ జరిగినట్టు గుర్తింపు**తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గొర్రెల స్కామ్‌పై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే గొర్రెల పథకంలో అక్రమాలను గుర్తించిన అధికారులు..*తాజాగా భారీ అవినీతి జరిగినట్లు కాగ్ రిపోర్టు వెల్లడించింది. గొర్రెలు కొనుగోలు చేయకుండానే.. కొన్నట్లు రికార్డుల్లో చూపించినట్లు కాగ్ రిపోర్టు తెలిపింది. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో దాదాపు 253 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. నకిలీ బిల్లులతో 92 కోట్ల రూపాయలు స్వాహా చేయగా.. గొర్రెల రవాణా పేరుతో మరో 68 కోట్ల రూపాయలు నొక్కేసినట్లు గుర్తించారు.
