రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగ రౌండ్ టేబుల్ సమావేశం:తెలంగాణ నిరుద్యోగ జేఏసీ

తెలంగాణ నిరుద్యోగ జేఏసీ
రేపు ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది…
మన నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి ఈ సమావేశానికి ఏర్పాటు చేయబోతున్నట్టు భవిషత్తులో ఉద్యమ ఉధృతానికి ఊపిరి పోయడానికి నిరుద్యోగుల లో ఆత్మస్తైర్యాన్ని నింపడానికి, ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టి నిరుద్యోగులకు న్యాయం చేసే విదంగా కార్యాచరణ రూపొందించబోతున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తెలిపింది. ఈ కార్యక్రమానికి శ్రీ ప్రో ” కోదండ రామ్ సార్ గారు, శ్రీ ” R.S. ప్రవీణ్ కుమార్ గారు, శ్రీ విఠల్ గారు,శ్రీ వినాయక రెడ్డి గారు,శ్రీ ప్రో రియాజ్ సార్,శ్రీ బల్మురి వెంకట్ గారు,శ్రీ నర్సింగ్ అడ్వకేట్ గారు పాల్గొననున్నారు.
తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్ TSPSC బోర్డ్ ప్రక్షాళనతోనే సాధ్యం అని భవిష్యత్ లో జరగబోయే పరీక్షలన్ని నూతన బోర్డ్ ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహించలనే అంశంపై నిరుద్యోగుల సమావేశం ఉంటుందని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తెలిపింది.
కావునా నిరుద్యోగ అభ్యర్థులు అందరు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఐక్యంగా ఉండి వారి ఉజ్వల బవిశ్యత్తుకై ప్రత్యేక్ష కార్యాచరణకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది.
